గుర్రాలు, రైనోలు వంటి గిట్టల జంతువుల ఆవిర్భావం భారత్‌లోనే జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ తరగతికి చెందిన దాదాపు 350కి పైగా శిలాజాలను పరిశీలించి, ఈ నిర్ధారణకు వచ్చారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. ఇందులో ఉత్తరాఖండ్‌లోని 'వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ'కి చెందిన కిశోర్ కుమార్ కూడా పాల్గొన్నారు. దాదాపు 5.5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండంలో జీవించిన గిట్టల జంతువుల అస్థిపంజరాలకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని ఆవిష్కరించారు.
గిట్టల జంతువుల ఆవిర్భావం భారత్‌లోనే!
గుర్రాలు, రైనోలు వంటి గిట్టలు ఉండే జంతువుల ఆవిర్భావం భారత్‌లోనే జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 5.5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండంలో జీవించిన గిట్టల జంతువుల అస్థిపంజరాలకు సంబంధించిన పూర్తి చిత్రాన్ని ఆవిష్కరించారు. గుజరాత్ లోని లిగ్నైట్ గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఆ పురాతన జాతి శిలాజాలు కనిపించాయన్నారు.
వీరు గొర్రె పరిమాణంలో ఉన్న ఒక జంతువు శిలాజాన్ని వెలికితీశారు. ఇది ప్రస్తుతం అంతరించిపోయిన కాంబే థెరియం అనే క్షీరదానికి సంబంధించినదిగా తేల్చారు. గిట్టలు కలిగిన క్షీరదాలకు, వాటికి ముందున్న జంతువులకు మధ్య వారధిలా ఈ జాతి పనిచేసిందన్నారు. 6.6- 5.6 కోట్ల ఏళ్ల కిందట ఇవి నేటి భారత్ లేదా సమీప ప్రాంతంలో ఆవిర్భవించి ఉండొచ్చని వివరించారు. నాడు భారత్ ఒక ద్వీప ఖండంగా ఉండే దని చెప్పారు. ఆ తర్వాత అది ఆసియా ఖండంలో విలీనమైందన్నారు. గుజరాత్‌లోని లిగ్నైట్ గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఆ పురాతన జాతి శిలాజాలు కనిపించాయన్నారు.