పాకిస్థాన్‌లోని భారత రాయబారి అజయ్ బిసారియా స్వదేశానికి చేరుకున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు నిరసనగా దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకుంటామని ప్రకటించిన పాక్ భారత రాయబారిని వెనక్కి పంపించింది. కశ్మీర్ అంశం నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్ చేసిన సూచనను దాయాది దేశం పరిగణనలోకి తీసుకోలేదు. పాక్ నిర్ణయం కారణంగా ఆ దేశాన్ని వీడిన దౌత్యాధికారి అజయ్... దుబాయ్‌కి చేరుకుని అనంతరం స్వదేశంలో అడుగుపెట్టారు.
పాక్ రాయబారీ రాలేదు..!
ప్రస్తుతం భారత్‌లో పాక్ రాయబారి లేరు. ఇప్పటివరకు ఆ బాధ్యలను నిర్వర్తించిన సోహెైల్ మహ్మద్ పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియామకమయ్యారు. కశ్మీర్ పరిణామాలకు ముందు మొయిన్ ఉల్ హక్నురాయబారిగానియమించింది పాక్. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు కారణంగా దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామన్న నిర్ణయానికి అనుగుణంగా మొయిన్‌ను భారత్‌కు పంపలేదు పాక్.