గణతంత్ర దినోత్సవం రోజున ఏటా భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వాఘా వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాలను ఈ సారి రద్దు చేస్తున్నట్లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. వాఘా సరిహద్దుల్లో ఏటా నిర్వహించే రీట్రీట్ కార్యక్రమాన్ని ఈ సారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మహమ్మారి కారణంగా సాధారణ ప్రజలకు అనుమతిని రద్దు చేశారు.
భారత సరిహద్దు దళం, పాకిస్థాన్ రేంజర్స్ సైనికులు మధ్య 1959 నుంచి ఉమ్మడిగా రీట్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా వాఘా సరిహద్దు వద్ద కార్యక్రమాలను గత ఏడాది మార్చి 7 నుంచి నిలిపివేశారు.