తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే వెంటిలేటర్‌తో అనేక మందికి సేవలు

కరోనాపై పోరుకు భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్​డీఓ రంగంలోకి దిగింది. అనేక మందికి సేవలందించే వెంటిలేటర్, కరోనా దరిచేరని బాడీ సూట్, సరసమైన ధరకు లభించే శానిటైజర్​, ఎన్​-99 మాస్కులను రూపొందించింది.

DRDO has entered the field of war against Corona
ఒకే వెంటిలేటర్‌తో అనేక మందికి సేవలు

By

Published : Mar 27, 2020, 8:06 AM IST

Updated : Mar 27, 2020, 8:24 AM IST

కరోనాపై పోరులో తనవంతు చేయూతనందించడానికి భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) సిద్ధమైంది. చైనాలో వైరస్‌ ఉద్ధృతిని పసిగట్టిన ఈ సంస్థ ముందు నుంచే దానిపై దృష్టిసారించి నివారణ పరికరాల ఉత్పత్తిపై దృష్టి సారించింది. అందులో భాగంగా.. అనేక మందికి సేవలు అందించే వెంటిలేటర్‌, కరోనా వైరస్‌ సోకనివ్వని బాడీ సూట్‌, తక్కువ ధరల్లోనే శానిటైజర్‌, ఎన్‌-99 మాస్క్‌లకు రూపకల్పన చేసింది. దేశంలో కరోనా రోగుల సంఖ్య 30కి చేరే నాటికే అప్రమత్తమై దీని నివారణకు అవసరమైన వైద్య పరికరాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసి, సరఫరా చేయడానికి సంస్థ నడుం బిగించింది.

  • లీటరు శానిటైజర్‌ను రూ.120కే ఉత్పత్తి చేస్తోంది. రోజుకు 20వేల నుంచి 30వేల లీటర్లను గ్వాలియర్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌ ఉత్పత్తి చేస్తోంది. దాన్ని 200, 500 మిల్లీ లీటర్ల సీసాల్లో బహిరంగ మార్కెట్‌లో విక్రయాలకు అనుగుణంగా సిద్ధంచేసింది.
  • రోజుకు పదివేల ఎన్‌-99 మాస్క్‌లు తయారుచేసేలా డీఆర్‌డీవో డిజైన్‌ రూపకల్పన చేసింది. ఒక్కో మాస్కు ధర రూ.70.
  • రోగులకు సేవచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారిన పడకుండా ఉండటానికి వీలుగా పకడ్బందీ బాడీ సూట్‌కు రూపకల్పన చేసింది. ఇది వైరస్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఉతకడానికి వీలైన ఈ సూట్‌ ‘అమెరికన్‌ సొసైటీ టెస్టింగ్‌ అండ్‌ మెటీరియల్‌ స్టాండర్డ్స్‌’ పరీక్షలోనూ నెగ్గింది. రూ.7వేల విలువైన ఈ సూట్‌.. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా సోకకుండా రక్షిస్తుందని డీఆర్‌డీవో, ఇతర సంస్థల పరీక్షల్లో తేలింది. వీటిని రోజుకు పదివేల చొప్పున ఉత్పత్తి చేయడానికి సిద్ధమైనట్లు డీఆర్‌డీవో అధిపతి జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు.
  • ఒకే వెంటిలేటర్‌ ద్వారా అనేక మంది రోగులకు సేవలందించే వినూత్న వెంటిలేటర్‌కు బెంగుళూరు డీఆర్‌డీవో ల్యాబ్‌ రూపకల్పన చేసింది. తొలి నెలలో 5వేలు, ఆ తర్వాత పదివేల చొప్పున వీటిని తయారు చేయడానికి సంస్థ సిద్ధమైంది. ఇందుకు అనువైన ఉపకరణాలను మహీంద్ర సంస్థ రూపొందించనుంది. ఈ వెంటిలేటర్లను వేగంగా తయారుచేయడానికి వీలుగా దాని డిజైన్‌ను తొమ్మిది కంపెనీలకు బదిలీ చేయడానికి ఔషధ శాఖ శాఖ కార్యదర్శి ఆమోదముద్ర వేశారు. ఒక్కో వెంటిలేటర్‌ ధర రూ.4 లక్షలు ఉంటుంది.
Last Updated : Mar 27, 2020, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details