వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్-చైనా దళాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. రేజంగ్ లా శిఖరం వద్ద ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
శాంతిమంత్రం...
మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో కాల్పుల కలకలంపై మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో చైనా శాంతి జపాన్ని మొదలుపెట్టింది. ఉద్రిక్తతలను తగ్గించేందుకు సాధ్యమైనంత త్వరగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావాలని ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర చర్చల ద్వారా ఇది సాధ్యపడుతుందని పేర్కొంది. శీతాకాలం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇరు పక్షాలకు ఇదే మంచిదని వెల్లడించింది.