తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దుల్లో వాయుసేన కసరత్తు

సరిహద్దుల్లో భారత వాయుసేన భారీ స్థాయిలో సన్నాహక కసరత్తు చేసింది. పాకిస్థాన్​ మరోసారి దుస్సాహసాలకు పాల్పడితే గగనతలంలో దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది వాయుసేన.

ప్రతిఘటనకు వాయుసేన సన్నాహాలు

By

Published : Mar 16, 2019, 9:46 AM IST

ప్రతిఘటనకు వాయుసేన సన్నాహాలు
పంజాబ్, జమ్ము సరిహద్దుల్లో భారత వాయుసేన సన్నాహక కసరత్తు చేసింది. ఇందులో భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. సన్నాహకాల్లో భాగంగా సూపర్​సోనిక్ వేగంతో యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టాయి.

మరోసారి భారత గగనతలంలోకి చొరబడేందుకు పాక్ పాల్పడితే సమర్థంగా ఎదుర్కొనేలా సిద్ధమవుతోంది వాయుసేన. కొన్ని రోజుల క్రితం పూంచ్ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖకు పది కిలోమీటర్ల దూరంలో రెండు పాకిస్థాన్ వాయుసేన విమానాలు విహరించడాన్ని అధికారులు గుర్తించారు. ఆ సమయంలో వాటిని ఎదుర్కొనేందుకు వాయుసేన వ్యవస్థను అప్రమత్తం చేశారు.

ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి చొరబడిన ఎఫ్​​-16 యుద్ధ విమానాలను ప్రతిఘటించేందుకు మిగ్-21తో వింగ్ కమాండర్ అభినందన్ ప్రయత్నించారు. ముఖాముఖి యుద్ధంలో పాక్ విమానాన్ని కూల్చిన అనంతరం అభినందన్ ప్రయాణించిన మిగ్-21 సైతం పొరుగుదేశంలో కూలిపోయింది. జైషే మహ్మద్​ ఉగ్రవాద శిబిరాలపై భారత్​ వైమానిక దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సైనిక స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకోవడాన్ని భారత్​ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో ఐఏఎఫ్ మరింత అప్రమత్తమైంది.

ABOUT THE AUTHOR

...view details