భారత్- నేపాల్ మధ్య విభేదాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నేపాల్‌తో సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన భాజపా జన్‌సంవాద్ సభలో ప్రసంగించిన ఆయన .. ఈ విషయాలను భారత్ ఎప్పటికీ మరచిపోదని ఉద్ఘాటించారు.
"ధార్చూలాలో ఎన్ని కంచెలను నిర్మించినా రెండు దేశాల మధ్య బంధం విడిపోదు. లిపులేఖ్ రోడ్డుకు సంబంధించి నేపాల్ తప్పుగా అర్థం చేసుకుంది. ఎటువంటి సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాం. భారత్- నేపాల్ మధ్య అనుబంధం సామాన్యమైనది కాదు. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం వంటిది. ప్రపంచంలో ఏ శక్తీ భారత్- నేపాల్ స్నేహాన్ని విడదీయలేదు."