తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌' - కరోనా తాజా వార్త

ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్​ను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. ఇప్పటికే వైరస్​ వ్యాక్సిన్లలో ఒకటి మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నట్లు తెలిపారు.

India will develop COVID-19 vaccine by end of 2020: Harsh Vardhan
ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌

By

Published : Aug 23, 2020, 12:22 PM IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను 2020 చివరి నాటికి సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌‌ శనివారం తెలిపారు.

"కొవిడ్‌-19 వ్యాక్సిన్​ క్యాండిడేట్లలో ఒకటి క్లినికల్‌ ట్రయల్స్​ మూడో దశలో ఉందన్నారు. మేం ఎంతో నమ్మకంగా ఉన్నాం.. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తాం." అని పేర్కొన్నారు.

భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,044,940కు చేరింది. శనివారం ఒక్కరోజే 68,898 కేసులు నమోదవ్వగా.. 983 మంది మృతి చెందారు. 22.71 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు

ఇదీ చూడండికోమాలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

ABOUT THE AUTHOR

...view details