దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 3,307 కేసులు, 114 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,16,752కి, మరణాల సంఖ్య 5651కి పెరిగింది.
- తమిళనాడులో ఇవాళ మరో 2,174 మంది కొవిడ్ బారినపడ్డారు. 48 మరణాలు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 50,193కి చేరింది. మృతుల సంఖ్య 576కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో మొదటిసారిగా ఒక్క రోజులో 25,000 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ తెలిపింది.
- దిల్లీలో కొత్తగా 2,414 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. మరోవైపు ఇవాళ 67 మంది కొవిడ్ బారినపడి మరణించారు. దిల్లీలో ఇప్పటి వరకు 47,102 కేసులు, 1904 మరణాలు నమోదుకాగా... 1,745 మంది కోలుకున్నారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 583 కొవిడ్ కేసులు, 30 మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో రాష్ట్రంలో ఇదే అత్యధికం. దీనితో మొత్తం కేసుల సంఖ్య 15,181కి, మరణాలు 465కి చేరుకున్నాయి.
- గుజరాత్లో మరో 520 కేసులు, 27 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 25 వేలు దాటగా.. మరణాలు 1,561కి పెరిగాయి.
- మధ్యప్రదేశ్‌లో మరో 44 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4,134కి చేరింది.
- కర్ణాటకలో గడచిన 24 గంటల్లో 204 పాజిటివ్ కేసులు, 8 మరణాలు సంభవించాయి.
- పంజాబ్‌లో ఇవాళ 126 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
- అసోంలో కొత్తగా నమోదైన 95 కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 4,605కి పెరిగింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2,183 యాక్టివ్ కేసులున్నాయి.
- బంగాల్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇవాళ అక్కడ 391 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు 6,533 మంది కోలుకోవడం కాస్త ఊరట.
- రాజస్థాన్‌లో మరో 326 మంది కొవిడ్ బారిన పడగా.. ఐదుగురు మరణించారు. దీనితో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 13,542కి, మరణాలు 313కి పెరిగాయి. ఇప్పటి వరకు 10,034 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
- హిమాచల్‌ప్రదేశ్‌లో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 570 కేసులు, 6 మరణాలు సంభవించాయి. మరో 365 మంది కోలుకున్నారు.