తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్- అమెరికా వాణిజ్య బంధం బలోపేతం

భారత్- అమెరికాల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాల పరిష్కారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఇరుదేశాల ఉన్నతాధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్​ గోయల్​తోనూ.. అగ్రరాజ్య ప్రతినిధులు భేటీ అయ్యారు.

భారత్-అమెరికా వాణిజ్య బంధం బలోపేతం

By

Published : Jul 13, 2019, 6:47 AM IST

Updated : Jul 13, 2019, 7:12 AM IST

భారత్​ - అమెరికా వాణిజ్య చర్చలు

భారత్​- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా.. ఇరుదేశాల ఉన్నతాధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. వాణిజ్య సమస్యలతో పాటు మరిన్ని కీలకాంశాలపై దక్షిణ, మధ్య ఆసియా యూఎస్​ వాణిజ్య ప్రతినిధి (ఏయూఎస్​టీఆర్​) క్రిస్టోఫర్ విల్సన్ నేతృత్వంలోని బృందం.. భారత అధికారులతో సమావేశం అయింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించి పరస్పరం ఫలితాలు పొందే విధంగా ఈ చర్చలు జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ తెలిపింది.

ఇరుదేశాల వాణిజ్య వివాదాలపై చర్చలు జరగాలని ఒసాకా సమావేశం సందర్భంగా మోదీ, ట్రంప్​ నిర్ణయించారు. అందులో భాగంగా శుక్రవారం భారత్​- అమెరికా అధికారుల భేటీ జరిగింది.

వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్​ గోయల్​తోనూ క్రిస్టోఫర్​ విల్సన్​ బృందం సమావేశం అయింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా యూఎస్​ అధికారులతో సమావేశం జరిగినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్​ గోయల్​ ట్వీట్ చేశారు.

" భారత్​- అమెరికా వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసేందుకు యూఎస్​ వాణిజ్య ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యాను. ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు అనేక సమస్యలపై చర్చించాం."
- పీయూష్​ గోయల్​, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి

Last Updated : Jul 13, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details