తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రష్యాలో యుద్ధ విన్యాసాలకు భారత్​ దూరం - russia kavkaz 2020

రష్యాలో జరిగే అంతర్జాతీయ యుద్ధ విన్యాసాల్లో పాల్గొనకూడదని భారత్​ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్​ విజృంభణ ఇందుకు కారణంగా చెప్పింది. అయితే చైనా, పాకిస్థాన్​ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనటమే ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణమని అధికార వర్గాల సమాచారం.

INDORUSSIA-EXERCISE-WITHDRAW
యుద్ధ విన్యాసాలు

By

Published : Aug 29, 2020, 9:30 PM IST

Updated : Aug 29, 2020, 11:00 PM IST

రష్యాలో జరిగే అంతర్జాతీయ యుద్ధ విన్యాసాలు 'కావ్​కాజ్​-2020'లో పాల్గొనకూడదని భారత్​ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటమే ఇందుకు కారణం అని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యాకు కూడా విన్నవించినట్టు పేర్కొంది.

అయితే చైనా, పాకిస్థాన్​ బలగాలు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొనటమే భారత్​ నిర్ణయానికి ముఖ్య కారణమని అధికార వర్గాల సమాచారం.

"సౌత్​ బ్లాక్​లో విదేశాంగ మంత్రి జైశంకర్​, చీఫ్​ ఆఫ్ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్ బిపిన్ రావత్ సమక్షంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనా, పాక్​ బలగాలు కూడా వస్తోన్న నేపథ్యంలో విన్యాసాల్లో పాల్గొనటం సరైనది కాదని చర్చించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నా చైనాతో కలిసి విన్యాసాలు చేయటం అంత మంచిది కాదు."

- రక్షణ శాఖ వర్గాలు

తొలుత భారత్​ ఈ కార్యక్రమానికి 150 ఆర్మీ , 45 మంది వాయుసేనతోపాటు కొంతమంది నేవీ అధికారులను పంపాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

దక్షిణ రష్యాలోని అస్త్రాఖాన్​ ప్రాంతంలో సెప్టెంబర్​ 15-26 మధ్య యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇందులో చైనా, పాక్​తోపాటు షాంఘై సహకార సంఘం సభ్య దేశాలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో ఆధిపత్య పోరు'

Last Updated : Aug 29, 2020, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details