తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా​ రాకతో చివరి దశకు కరోనాపై పోరు' - అమిత్ షా పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనాపై విజయవంతంగా పోరాడామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో టీకా రాకతో కరోనాపై పోరులో చివరి దశకు వచ్చామని వ్యాఖ్యానించారు.

hm amit shah, karnataka
ప్రశంగిస్తున్న అమిత్ షా

By

Published : Jan 16, 2021, 9:50 PM IST

Updated : Jan 16, 2021, 10:01 PM IST

వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభంతో కరోనాపై పోరులో చివరి దశకు చేరుకున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిపై దేశం విజయవంతంగా పోరాడిందని తెలిపారు. కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని భద్రవతి గ్రామం వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు షా. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్​ పంపిణీపై ఈ మేరకు వ్యాఖ్యానించారు.

భూమిపూజలో అమిత్ షా

"ఏడాదిగా కరోనాపై ప్రపంచం జరుపుతున్న పోరులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి వ్యాప్తి.. ప్రారంభంలో భారత్​ సహా పలు దేశాలపై నిపుణులు సందేహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మన దేశంలో పరిశోధనలు జరిపేందుకు కేవలం ఒక్క ప్రయోగశాల మాత్రమే ఉంది, ఇప్పుడు 2000 ఉన్నాయి. మనం అందరం కలిసికట్టుగా పోరాడటం వల్లే విజయం సాధించాము."

-అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి.

సీఎంకు ధన్యవాదాలు..

ఆర్​ఏఎఫ్ క్యాంపస్ నిర్మాణానికి స్థలం కేటాయించడంలో కృషి చేసినందుకు సీఎం యడియూరప్పకు అభినందనలు తెలిపారు షా. కేంద్రీయ విద్యాలయాలను, మైదానాలను స్థానికులు ఉపయోగించుకునే రీతిలో తీర్చిదిద్దుతామని అన్నారు. 50.29 ఎకరాల స్థలంలో రూ.230 కోట్లతో ఈ క్యాంపస్​ను నిర్మించనున్నారు.

'5 ఏళ్లు కాదు.. మళ్లీ మాదే అధికారం'

కర్ణాటకలో భాజపా ఐదేళ్లు పూర్తి చేసుకోవడమే కాక వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తుందని షా ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో భాజపా కొనసాగడంపై వస్తున్న విమర్శలపై ఈ విధంగా స్పందించారు. ప్రతిపక్షాలు భాజపాను తప్పుపట్టడం మానుకొని ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :'భారత్​-నేపాల్​ బంధం ప్రభుత్వాలకే పరిమితం కాదు'

Last Updated : Jan 16, 2021, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details