భూమి నుంచి భూమి మీద ఉన్న లక్ష్యాలను చేధించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. అండమాన్-నికోబార్ దీవుల నుంచి మరో దీవిలో ఉన్న లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణి చేధించినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం - brahmos supersonic cruise missile
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని శాస్త్రవేత్తలు మరోసారి విజయవంతంగా పరీక్షించారు. నాలుగు వందల కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని సులువుగా చేధించినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాలు ఉపయోగించుకునేలా ఈ క్షిపణిని రూపొందిచారు.
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
భారత్-రష్యా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణని.. త్రివిధ దళాలు వినియోగించేలా దీనిని రూపొందించారు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నాలుగు వందల కిమీ లోపు ఎక్కడ ఉండే లక్ష్యాన్నైనా చేధించేలా బ్రహ్మోస్ క్షిపణుల రకాలను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఆయా క్షిపణులను మరింత మెరుగుపెట్టేలా సన్నద్ధతను పరీక్షిస్తున్నారు.