ప్రధాని మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్ అనుమతించకపోవడంపై భారత్ మండిపడింది. దాయాది దేశంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐసీఏఓకు ఫిర్యాదు చేసింది.
ప్రధాని మోదీ సౌదీ పర్యటన నేపథ్యంలో భారత్ అభ్యర్థనను పాక్ తోసిపుచ్చింది. తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు దాయాది దేశం అంగీకరించని నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. సహజంగా ఐసీఏఓ నిబంధనల ప్రకారం ప్రతి దేశం వీవీఐపీల గగనతల ప్రయాణాలకు అనుమతులిస్తాయి. ఇదివరకే రెండుసార్లు పాక్ ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడిన కారణంతో విసిగిపోయిన భారత్.. ఆ దేశానికి బుద్ధి చెప్పదలచుకుంది.