తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కలకలం: వుహాన్​లో మనోళ్లు సురక్షితమేనా? - carona virus latest news

వుహాన్... చైనాలోని ఓ నగరం. రాకాసి కరోనా వైరస్​ వ్యాప్తికి మూలం. మరింత నష్టం జరగకుండా చూసేందుకు ఆ నగరానికి పూర్తిగా రాకపోకలు నిషేధించింది చైనా. మరి అక్కడున్న భారతీయుల సంగతేంటి? ఎంత మంది ఉన్నారు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలియక తల పట్టుకుంటున్నారు కేంద్రప్రభుత్వ అధికారులు.

India steps in to prevent coronavirus-deployed health teams to nepal boarder
కరోనా కలకలం: వుహాన్​లో మనోళ్లు సురక్షితమేనా?

By

Published : Jan 27, 2020, 7:30 PM IST

Updated : Feb 28, 2020, 4:27 AM IST

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున భారత్​ అప్రమత్తమైంది. వైరస్​ తీవ్రత ఎక్కువగా వుహాన్​లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా దేశానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం వుహాన్​ సహా చైనాలోని ఇతర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారన్న పక్కా సమాచారం తెలియక కేంద్రం అయోమయంలో పడింది.

వుహాన్​లో 500మందికిపైగా భారతీయ విద్యార్థులు పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్నారు. అయితే అందులో చాలామంది చైనీస్​ న్యూ ఇయర్​ సెలవుల సందర్భంగా వుహాన్​ను విడిచి వెళ్లినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 45మంది విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్నట్లు బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

"సాధారణంగా అక్కడ ఉన్న భారతీయులు కాన్సులేట్‌లో నమోదు చేసుకోరు. వారు పట్టణం విడిచి వెళ్తున్నప్పుడు కూడా కాన్సులేట్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వరు"

-విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి

చైనా వ్యాప్తంగా వైరస్​ బారిన పడి ఇప్పటి వరకు 80మంది చనిపోయారు. 2,744 మందికి వైరస్​ సోకగా.. 461మంది పరిస్థితి విషమంగా మారింది. మరో 6వేల అనుమానిత కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్​లో ఎనిమిది మంది, మకావూ​లో ఐదుగురు, తైవాన్​లో నలుగురు, తాజాగా నేపాల్​లో ఒకరు వైరస్​ బారిన పడ్డారు..

మోదీకి కేరళ సీఎం లేఖ..

వుహాన్​లో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అక్కడి భారతీయులను ప్రత్యేక విమానంలో తీసుకురావాలని కోరారు.

నేపాల్​ సరిహద్దుకు వైద్య బృందాలు..

నేపాల్​లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు తేలిన నేపథ్యంలో భారత్​ అప్రమత్తమైంది. నేపాల్​ సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యేక వైద్య బృందాలను తరలించింది. బంగాల్‌లోని పానితాంకి, ఉత్తరాఖండ్‌లోని జూలాఘాట్​, జౌజూబీ ప్రాంతాల్లో వైద్య బృందాలను మోహరించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్​లో తెలిపింది.

కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష

నేపాల్​ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్​, ఉత్తరప్రదేశ్​, బంగాల్​, సిక్కింతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. వైరస్​ సరిహద్దు దాటి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

Last Updated : Feb 28, 2020, 4:27 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details