రక్షణ రంగంలో భారత్, రష్యా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ మేరకు పరస్పర సహకారాన్ని ఇంకా పెంచుకోవాలని ఇరుదేశాలు తాజాగా నిర్ణయించాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షొయిగుతో గురువారం భేటీ అయ్యారు.
రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచుకోవడం సహా.. పలు అంశాలపై రాజ్నాథ్, షొయిగులు చర్చలు జరిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా భారత్కు ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రి, ఇతర రక్షణ పరికరాల సరఫరాను వేగిరం చేయాల్సిందిగా రష్యాను కోరారు రాజ్నాథ్. సెర్గీతో తన భేటీ అద్భుతంగా సాగిందని ట్విట్టర్ వేదికగా భారత రక్షణ మంత్రి తెలిపారు. 'భారత్లో తయారీ'కి అండగా నిలుస్తామని రష్యా హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.