ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ విజృంభణ ఇప్పుడు అమెరికాలో తీవ్రమైంది. ఇలాంటి సందర్భాల్లో హెచ్1-బీ వీసా ఉన్న భారతీయ ఉద్యోగుల.. ఉపాధి భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
కరోనా సంక్షోభం కారణంగా భారతీయుల హెచ్1-బీ వీసాల గడువును పెంచాలని అమెరికాను కోరింది భారత్. ఈ మేరకు అమెరికా విదేశాంగ సహాయ కార్యదర్శి స్టీఫెన్ ఈ.బీగన్తో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ చర్చించారు.