ప్రాణాంతక కరోనా వైరస్‌తో ఇప్పటికే కేరళకు చెందిన ఓ వైద్య విద్యార్థిని చికిత్స పొందుతుండగా.. తాజాగా మరో కేసు నమోదైంది. అదే రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తికి ఈ ప్రమాదకర వైరస్ సోకినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. చైనాకు వెళ్లివచ్చినందునే రోగికి వైరస్ సోకిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
వుహాన్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతికి ఇటీవలే కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. అలాగే ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై తప్పుడు ప్రచారాలు చేసిన ముగ్గురు కేరళ వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.