తెలంగాణ

telangana

ETV Bharat / bharat

25 ఏళ్లలో గరిష్ఠ వర్షపాతం నమోదు: ఐఎండీ - వర్షపాతం

1994 అనంతరం.. దేశంలో అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. 4 నెలల వర్షాకాలం అధికారికంగా నేటితో ముగిసినట్లు తెలిపింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.

25 ఏళ్లలో గరిష్ఠ వర్షపాతం

By

Published : Sep 30, 2019, 11:48 PM IST

Updated : Oct 2, 2019, 4:43 PM IST

ఈ ఏడాది రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. 1994 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావటం ఇదే ప్రథమమని తెలిపింది. 4 నెలల వర్షాకాలం నేటితో ముగిసినట్లు ఐఎండీ ప్రకటించింది. అయినప్పటికీ.... పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

జూన్ 8న రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఆ నెలలో 33 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణం కంటే 33 శాతం, ఆగస్టులో 15 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

Last Updated : Oct 2, 2019, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details