తెలంగాణ

telangana

భారత్​లోనే అత్యల్ప కరోనా మరణాలు- 10 లక్షల్లో ఇద్దరు

By

Published : May 19, 2020, 7:18 PM IST

ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్​లో మరణాల రేటు అత్యల్పంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా బారిన పడి ప్రపంచ జనాభాలో ప్రతి లక్ష మందికి 4.1 మంది మృతిచెందగా.. భారత్​లో 0.2 మరణాలు సంభవించాయని తెలిపింది.

VIRUS-HEALTH MINISTRY
భారత్​లోనే అత్యల్ప కరోనా మరణాలు

ప్రపంచ సగటుతో పోలిస్తే కరోనా మరణాల రేటు భారత్​లో అత్యల్పంగా నమోదైంది. లక్ష మంది జనాభాకు 0.2 మరణాలు(10 లక్షల మందికి ఇద్దరు) సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య 4.1గా ఉంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,01,139కు చేరగా.. 3,163 మంది మరణించారు. 39,173 మంది కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక-119 ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 3,11,847 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

దేశాల వారీగా చూస్తే..

దేశం మరణాల సంఖ్య లక్ష జనాభాకు
అమెరికా 87,180 26.6
బ్రిటన్ 34,636 52.1
ఇటలీ 31,908 52.8
ఫ్రాన్స్​ 28,059 41.9
స్పెయిన్​ 27,650 59.2
జర్మనీ 7,935 9.6
ఇరాన్​ 6,988 8.5
కెనడా 5,702 15.4
నెదర్లాండ్స్ 5,680 33
మెక్సికో 5,045 4
చైనా 4,645 0.3

ప్రభుత్వ చర్యలతోనే..

దేశంలో మరణాలు రేటు తక్కువగా ఉండటానికి కారణం సమయానికి తగినట్లు ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాంటాక్ట్ ట్రేసింగ్​, సత్వర చికిత్సతో మరణాలను నిలువరించగలిగామని పేర్కొంది.

రికార్డు స్థాయిలో పరీక్షలు..

భారత్​ చాలా వేగంగా నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 385 ప్రభుత్వ, 158 ప్రైవేటు ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో సోమవారం రికార్డు స్థాయిలో 1,08,233 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 24,25,742 నిర్ధరణ పరీక్షలు చేశామని వివరించింది.

ఆర్​టీ-పీసీఆర్​తో పాటు ట్రూఎన్​ఏటీ, సీబీఎన్​ఏఏటీ వంటి యంత్రాలతోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 14 ఎయిమ్స్​ తరహా సంస్థలు ల్యాబొరేటరీల్లోని భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కిట్ల సరఫరా కోసం 15 డిపోలను ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ 4.0: బస్సులు రయ్​రయ్​- సెలూన్లు హౌస్​ఫుల్​

ABOUT THE AUTHOR

...view details