తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి.. - భారత్​

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు భారత్ యత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందుకోసం వాఘా సరిహద్దులో ఈనెల 14న పాక్ అధికారులతో మరోసారి చర్చలు జరపనుంది. భద్రతా పరమైన అంశాలతో పాటు ఎంతమంది యాత్రికులను అనుమతించాలన్న అంశాలపై అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.

కర్తార్​పుర్​ నడవాపై భారత్​-పాక్​ మరోసారి..

By

Published : Jul 13, 2019, 5:37 AM IST

Updated : Jul 13, 2019, 8:28 AM IST

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశం

కర్తార్​పుర్​ నడవా నిర్మాణంపై భారత్​-పాక్​ అధికారులు మరోసారి సమావేశం కానున్నారు. ఈనెల 14న వాఘా సరిహద్దులో చర్చలు జరపనున్నారు. భద్రతా పరమైన అంశాలతో పాటు నడవా ద్వారా ఎంతమంది భక్తులను అనుమతించాలన్న అంశాలపై ప్రధానంగా దృష్టిసారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నడవా విధివిధానాలు, సాంకేతిక సమస్యలపైనా చర్చలు జరపనున్నారు.

అక్టోబర్​ 31కి పూర్తి...

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం పూర్తయితే పంజాబ్‌ గురుదాస్‌పుర్ నుంచి... సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు సాగించొచ్చు. అందుకే గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019, నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్టోబర్​ 31 నాటికి నడవా నిర్మాణం పూర్తి చేసేందుకు రూ. 500 కోట్లకు పైగా కేటాయించనున్నట్లు సమాచారం.

ప్రత్యేక సందర్భాల్లో 10 వేల మంది భక్తులు, సాధారణ రోజుల్లో 5 వేల మందిని పాక్‌ పంపించేందుకు కృషి చేస్తోంది. యాత్ర పొడవునా బలమైన భద్రత కోసం అధునాతన నిఘా వ్యవస్థను ఉపయోగించనుంది.

గతేడాది శంకుస్థాపన

కర్తార్​పుర్​ నడవాకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ గతేడాది నవంబర్​ 26న పంజాబ్​లోని గురుదాస్​పుర్​లో శంకుస్థాపన చేశారు.

Last Updated : Jul 13, 2019, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details