తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్‌లో 'ముడుపుల' ముప్పు ఎక్కువే - లంచాల డిమాండ్​ జాబితా

ప్రపంచవ్యాప్తంగా లంచాల కోసం వచ్చే డిమాండ్​ల ఆధారంగా తయారు చేసిన ఓ సూచీలో 194 దేశాల్లో భారత్​ 77వ స్థానంలో నిలిచింది. వ్యాపార నిర్వహణకు భారత్​లో ముడుపులు ముట్టజెప్పాల్సిన ముప్పు ఎక్కువేనని తేల్చింది ఓ నివేదిక. చైనా, పాక్‌లలో మనకంటే ఎక్కువగా లంచాల బెడద ఉన్నట్లు తెలిపింది నివేదిక.

Bribe demand in India
భారత్‌లో ముడుపుల ముప్పు ఎక్కువే

By

Published : Nov 20, 2020, 6:23 AM IST

భారత్‌లో వ్యాపార నిర్వహణకు ముడుపులు ముట్టజెప్పాల్సిన ముప్పు ఎక్కువేనని తేలింది. ప్రపంచవ్యాప్తంగా లంచాల కోసం వచ్చే డిమాండ్‌ల ఆధారంగా తయారుచేసిన ఓ సూచీలో మన దేశం 77వ స్థానంలో ఉంది. 194 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేయడం ద్వారా 'ట్రేస్‌' అనే సంస్థ తాజా సూచీని రూపొందించింది. ఇందులో 45 స్కోరుతో మన దేశం 77వ స్థానానికి పరిమితమైంది. గత ఏడాది (48 స్కోరు, 78వ స్థానం)తో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడటం ఊరట కలిగించే అంశం. ముడుపులను నిరోధించే వ్యవస్థలు, ప్రభుత్వ - పౌర సేవల్లో పారదర్శకత, ప్రభుత్వంతో వ్యాపార చర్చలు, మీడియా పాత్ర వంటి అంశాలను అధ్యయనం చేసి ఆయా దేశాలకు ట్రేస్‌ స్కోరును కేటాయించింది. ఇందుకోసం ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి సంస్థల నుంచి కూడా సమాచారాన్ని సేకరించింది.

తాజా సూచీలోని మరిన్ని కీలక అంశాలివీ..

  • పెరూ, జోర్డాన్‌, ఉత్తర మాసిడోనియా, కొలంబియా, మాంటెనిగ్రో కూడా భారత్‌తో సమానంగా 45 స్కోరును సాధించాయి.
  • పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనా, నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో ముడుపుల బెడద మనకంటే ఎక్కువ. భూటాన్‌లో పరిస్థితి (48వ స్థానం) మెరుగ్గా ఉంది.
  • డెన్మార్క్‌, నార్వే, ఫిన్లాండ్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌లలో ముడుపులు చెల్లించాల్సిన ముప్పు అత్యంత తక్కువగా ఉంది.
  • ఉత్తర కొరియా, తుర్క్‌మెనిస్థాన్‌, దక్షిణ సూడాన్‌, వెనెజువెలా, ఎరిత్రియాల్లో ముప్పు అత్యధికం.
  • 2017 నుంచి 2019 వరకు ఈ సూచీలో అట్టడుగున ఉన్న సోమాలియా ఈ ఏడాది 187వ స్థానానికి చేరుకుంది.
  • ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేయకుండా నిరోధించేందుకుగాను చైనా కొంతకాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రేస్‌ తెలిపింది.

ఇదీ చూడండి: 'భారత్ కరోనా మరణాల్లో టాప్​.. జీడీపీలో ఫ్లాప్​​'

ABOUT THE AUTHOR

...view details