తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో మరో టీకా అభివృద్ధి.. త్వరలోనే​ ట్రయల్స్​!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో భారత్​లో మరో వ్యాక్సిన్​ అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేసంది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. అమెరికాకు చెందిన నోవావాక్స్​ సంస్థ రూపొందించిన టీకాను.. భారత్​లో క్లినికల్​ అభివృద్ధి బాధ్యతలను ఐసీఎంఆర్​, సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ సంయుక్తంగా తీసుకున్నట్లు తెెలిపింది. అక్టోబర్​ రెండో వారంలో క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

India is optimistic on another Covid19 vaccine
భారత్​లో మరో టీకా అభివృద్ధి.. త్వరలోనే​ ట్రయల్స్​!

By

Published : Sep 18, 2020, 10:03 PM IST

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా భారత్​లో మరో వ్యాక్సిన్​ అభివృద్ధికి తొలి అడుగులుపడ్డాయి. అమెరికా నోవావాక్స్​ రూపొందించిన 'గ్లైకోప్రొటీన్ సబ్యూనిట్ నానోపార్టికల్ సహాయక వ్యాక్సిన్'​ క్లినికల్​ అభివృద్ధి కోసం.. భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​), సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ)లు జట్టు కట్టాయి.

ఈ అమెరికా వ్యాక్సిన్​కు భారత్​లో క్లినికల్​ ట్రయల్స్​ చేపట్టనున్నట్లు లోక్​సభ వేదికగా వెల్లడించారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్​ చౌబే. అక్టోబర్​ రెండోవారంలో క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. ఈ ట్రయల్స్​కు ఐసీఎంఆర్​, జాతీయ ఎయిడ్స్​ పరిశోధన ఇన్​స్టిట్యూట్-​ పుణె నేతృత్వం వహిస్తుందని తెలిపారు.

"భారత్​ బయోటెక్​, కాడిలా వ్యాక్సిన్లు తొలిదశ క్లినికల్​ ట్రయల్స్​ను పూర్తిచేసుకున్నాయి. ఉత్తమమైన ఫలితాలను కనబరిచాయి. రెండు వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నాయి. ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ చాడోక్స్​-1 టీకాపై.. 14 కేంద్రాల్లో రెండు, మూడో దశ ట్రయల్స్​ జరుగుతున్నాయి. సీరమ్​, కాడిలా, భారత్​ బయోటెక్​లతో పాటు ఏడు సంస్థలకు ప్రీ-క్లినికల్​ పరీక్షలు, పరిశోధనలు, విశ్లేషణలకు.. సెంట్రల్​ డ్రగ్​ స్టాండర్డ్​ కంటోల్​ ఆర్గనైజేషన్​(సీడీఎస్​సీఓ) లైసెన్స్​లు ఇచ్చింది."

- అశ్విని కుమార్​ చౌబే, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి

భారత్​లోని అన్ని వ్యాక్సిన్​ క్యాండిడేట్లు నూతన ఔషధ, క్లినికల్​ ట్రయల్స్​ నియమాలు-2019ను అనుసరిస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి. వాటికి అనుగుణంగానే ప్రీ-క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ​దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని, ప్రతి 10లక్షల మందిలో పోలిస్తే ఇతర దేశాల కంటే పాజిటివ్​ కేసుల సంఖ్య అత్యల్పంగా ఉందన్నారు.

ఇదీ చూడండి:ప్రపంచంపై కొవిడ్​ విధ్వంసం- 3.04 కోట్లు దాటిన కేసులు

ABOUT THE AUTHOR

...view details