తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'5 ట్రిలియన్​ డాలర్ల భారత్​ కల తొందరలోనే సాకారం'

పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్​ అడుగులు వేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. థాయి​లాండ్​ పర్యటనలో భాగంగా బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. భారత్​లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన తరుణమని పారిశ్రామికవేత్తలకు సూచించారు. దేశంలో బ్యూరోక్రటిక్​ తరహా పాలనకు స్వస్తిపలికామన్నారు. తొందరలోనే భారత్​ అయిదు ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బ్యూరోక్రటిక్​ పాలనకు స్వస్తి: మోదీ

By

Published : Nov 3, 2019, 10:39 AM IST

Updated : Nov 3, 2019, 12:58 PM IST

'5 ట్రిలియన్​ డాలర్ల భారత్​ కల తొందరలోనే సాకారం'

బ్యూరోక్రటిక్​ తరహా పాలనకు స్వస్తి పలికి.. నవభారతం దిశగా భారత్​ అడుగులు వేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్థిక పరమైన సంస్కరణలు చేపడుతున్న కారణంగా భారత్​లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు. భారత పన్నుల విభాగంలో సమూల మార్పుల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్​ వాణిజ్య పెట్టుబడులకు అనుకూలంగా ఉందని.. అందుకు ఇదే సరైన సమయమని ప్రకటించారు.

థాయిలాండ్​లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బ్యాంకాక్​లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్​ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. బ్యూరోక్రటిక్​ పద్ధతిలో పాలన సాగించే విధానానికి స్వస్తి పలికి.. పాలనలో సంస్కరణలు తీసుకువచ్చామని ఉద్ఘాటించారు.

"భారత్​ ఇప్పుడు 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న కలను సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు.. దేశ జీడీపీ సుమారు 2 ట్రిలియన్​ డాలర్లు. 65 ఏళ్లలో రెండు ట్రిలియన్​ డాలర్లే.. కానీ, కేవలం అయిదేళ్లలోనే దేశ జీడీపీని సుమారు 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచాము. అయిదు ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలన్న భారత కల.. తొందరలోనే నిజమవుతుందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రస్తుతం భారత్​లో పన్నులు చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు ప్రధాని. ప్రజాహిత పన్ను విధానం కలిగిన దేశంగా భారత్​ నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు చేపడతమాని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్​ నిలిచిందని.. గత ఐదేళ్లలో 286 బిలియన్​​ అమెరికా డాలర్ల విదేశీ పెట్టుబడులు భారత్​కు వచ్చాయన్నారు మోదీ.

ఇదీ చూడండి: నూతన భారతావని: జమ్ము-కశ్మీర్​ యూటీలో పీఓకే

Last Updated : Nov 3, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details