స్విస్ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితాను భారత్కు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందజేసింది. స్విట్జర్లాండ్తో స్వయంచాలక సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈఓఐ) ప్రకారం పౌరులు, సంస్థల బ్యాంక్ ఖాతా వివరాలను భారత్ పొందింది.
అయితే, ఎంతమంది ఖాతాల వివరాలు అందాయి? ఆ ఖాతాల్లో ఎంత సొమ్ముంది? అనే విషయాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.
86 దేశాల జాబితా..
స్విస్ బ్యాంకు ఖాతాదారుల రెండో జాబితాను మొత్తం 86 దేశాలతో పంచుకున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. 3.1 మిలియన్ల ఖాతాలకు సంబంధించిన వివరాలను ఆయా దేశాలకు వివరించినట్లు చెప్పారు. ఈ 86 దేశాల్లో భారత్ కూడా ఉంది.
2018 నుంచి..
ఏఈఓఐ ఒప్పందంలో భాగంగా 2019 సెప్టెంబర్లో భారత్ మొదటి జాబితా పొందింది. ఇందులో 100 మంది భారత పౌరులు, సంస్థల ఖాతాల వివరాలను వెల్లడించింది స్విట్జర్లాండ్.
ఈ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్నవాటితోపాటు.. 2018 నుంచి మూసేసిన ఖాతాల వివరాలు మాత్రమే పంచుకునే వీలుంది. మరో జాబితా వచ్చే ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయనుంది.
బలమైన ఆధారాలుగా..
అయితే, స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి అందించిన జాబితాలో అక్రమార్కులతోపాటు వ్యాపారాలు, నిజమైన అవసరాల కోసం వినియోగించే వారి వివరాలు ఉంటాయి. ఈ వివరాలతో లెక్కల్లో లేని ధనాన్ని నిగ్గుతేల్చేందుకు భారత ప్రభుత్వానికి వీలుంటుందని, అక్రమార్కులపై కేసుల్లో బలమైన ఆధారాలుగా ఇవి పనిచేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:స్విస్బ్యాంక్ సొమ్ముల్లో పడిపోయిన భారత్ ర్యాంక్