తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేసులు తగ్గుతున్నాయ్​.. గరిష్ఠ స్థాయిని దాటేసినట్లే!

కరోనా కేసుల వృద్ధిలో భారత్ గరిష్ఠ స్థాయిని దాటేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే మహమ్మారి అంతరించిపోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. ఇకనుంచి ఆర్థిక వృద్ధి వేగం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

highest peak of covid cases in india
కొవిడ్​-19 కేసుల గరిష్ఠ స్థాయిని దాటేశాం..

By

Published : Oct 5, 2020, 12:00 PM IST

కరోనా కేసుల వృద్ధిలో భారత్ గరిష్ఠ స్థాయిని దాటేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ఎకనమిక్ డివిజన్ ఆదివారం విడుదల చేసిన నెలవారీ ఆర్థిక సమీక్షలో ఈ మేరకు పేర్కొంది. సెప్టెంబరు 17 నుంచి 30 వరకు కరోనా డేటాను పరిశీలిస్తే కొవిడ్-19 కేస్​లోడ్ పీక్​ను భారత్ దాటేసినట్లే కనిపిస్తోందని తెలిపింది.

ఆ రెండు వారాల్లో రోజువారీ కేసుల సంఖ్య సగటున 93 వేల నుంచి 83 వేలకు పడిపోయినట్లు గుర్తు చేసింది. అదే సమయంలో ప్రతిరోజూ పరీక్షల సంఖ్య 1.15 లక్షల నుంచి 1.24 లక్షల మేర పెరిగినట్లు తెలిపింది. అయితే మహమ్మారి అంతరించి పోవడానికి ఇంకా సమయం పడుతుందని అంచనా వేసింది.

" సెప్టెంబరు 30 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కేసులు 3.2 కోట్లకు పైగా చేరాయి. 9.7 లక్షల మంది చనిపోయారు. భారత్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, స్పెయిన్, ఫ్రాన్స్, కొలంబియా, పెరూల్లో రోజుకు 2.9 లక్షల మేర కొత్త కేసులొచ్చాయి. ఆ రోజుకు ప్రపంచంలో అత్యధిక కేసులు భారత్​లోనే నమోదయ్యాయి. అయితే ఆగస్టు 31 నాటికి 1.65% మేర పెరిగిన క్రియాశీలక కేసులు సెప్టెంబరు 30 నాటికి -0.4%కి పడిపోయాయి. రికవరీ కూడా 83.5%కి పెరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా సెప్టెంబరు 17-30 తేదీల మధ్య రెండు వారాల పరిస్థితిని చూస్తే భారత్​ పీక్​ను దాటేసినట్లు కనిపిస్తోంది. ఇక ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటుంది"

-- ఆర్థిక శాఖ.

  • ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అన్ని దేశాల సంయుక్త ఉత్పాదక సూచి(కాంపోజిట్ అవుట్​పుట్ ఇండెక్స్) 17 నెలల గరిష్ఠానికి (52.4)కి చేరింది.
  • భారత్​లో ద్వి, త్రిచక్ర వాహనాల అమ్మకాలు గత ఏడాది ఆగస్టు స్థాయికి చేరుకున్నాయి. కొవిడ్ కారణంగా ప్రైవేటు రవాణాకు డిమాండ్ పెరిగింది.
  • వరుసగా రెండో ఏడాది సాధారణం కంటే అధికవర్షాలు కురిశాయి. దీనికితోడు ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడం ఖరీఫ్ సీజన్​ బాగున్నట్లు లెక్క.
  • మార్చి నుంచి రైల్వే సరకు రవాణా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అన్​లాక్ మొదలుకావడం వల్ల ప్రయాణికుల ఆదాయం కూడా పెరుగుతోంది. సెప్టెంబరు నెల తొలి 20 రోజుల్లోనే రూ. 640.96 కోట్ల విలువైన టికెట్లు బుక్​ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details