పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు విచారణను మార్చి 29కి వాయిదా వేసింది కోర్టు. అయితే.. ఈ అంశంపై భారత్లో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. నీరవ్ మోదీ అరెస్టు... భాజపా విజయమని పేర్కొంది ఆ పార్టీ. అధికార పార్టీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయిప్రతిపక్షాలు.
ప్రతిపక్షాల విమర్శలు
"నీరవ్మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేస్తే అది భాజపా ప్రభుత్వ ఘనత ఎలా అవుతుంది? 13 వేల కోట్ల బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన నిందితుడు లండన్ పారిపోవడానికి సహకరించింది మీరు (భాజపా) కాదా?" అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై మండిపడ్డారు. నీరవ్ మోదీ అరెస్టును భాజపా రాజకీయం చేస్తోందని విమర్శించారు. పీఎన్బీ కుంభకోణం నిందితుడిని ముందుగా నిర్ణయించిన మేరకు ఎన్నికల సమయంలో అరెస్టు చేశారని ఆరోపించారు.