తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో గతేడాది కంటే తగ్గిన పత్రికా స్వేచ్ఛ - Violence against journalists

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ రెండు స్థానాలు దిగజారి 140వ స్థానంలో నిలిచింది. రిపోర్టర్స్​ వితౌట్​ బోర్డర్స్​ రూపొందించిన ఈ నివేదికలో నార్వే మొదటి స్థానం పొందింది.

భారత్‌లో క్షీణించిన పత్రికా స్వేచ్ఛ

By

Published : Apr 19, 2019, 7:23 AM IST

భారత్​లో పత్రికా స్వేచ్ఛ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు దిగజారింది. 180 దేశాలతో రూపొందించిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ-2019లో భారత్​ 140వ స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న 'రిపోర్టర్స్ వితౌట్​ బోర్డర్స్​' రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాత్రికేయులు మరింత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని తెలిపింది. పాత్రికేయులపై దాడులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భాజపా మద్దతుదారులేనని స్పష్టం చేసింది. హిందూత్వకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పాత్రికేయులే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో సమన్వయంతో కూడిన ద్వేషపూరిత ప్రచారం జరుగుతోందని వెల్లడించింది. మహిళల విషయంలో ఇది మరింత తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడమ్​ ఇండెక్స్​లో...

* పత్రికా స్వేచ్ఛలో నార్వే మొదటిస్థానంలో నిలిచింది. భారత్ 140వ స్థానానికి దిగజారింది.

* ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయుల పట్ల శత్రుత్వ వైఖరి పెరుగుతోంది. ప్రభుత్వాలు మీడియాపై పట్టు పెంచుకుంటున్నాయి.

* గతేడాది భారత్​లో ఆరుగురు పాత్రికేయులు హత్యకు గురయ్యారు.

* పోలీసుల హింస, మావోయిస్టు దాడులు, నేరస్థులు, అవినీతిపరుల ప్రతీకార చర్యల వల్ల భారత పాత్రికేయలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆంగ్లేతర భాషల పాత్రికేయులకు ముప్పు ఎక్కువ.

* కశ్మీర్ ​లాంటి సున్నిత ప్రాంతాల్లో పనిచేయడం చాలా కష్టంగా మారింది. ఇక్కడ విదేశీ పాత్రికేయులను అడుగుపెట్టనీయడం లేదు.

దక్షిణాసియాలో మరీ తీసికట్టు

దక్షిణాసియాలో పత్రికా స్వేచ్ఛకు ఏటికేడు తూట్లు పడుతున్నాయి. ఇంతకు ముందుతో పోలిస్తే పాకిస్థాన్​ 3 స్థానాలు దిగజారి 142వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్​ 150, చైనా 177వ ర్యాంకులకు దిగజారాయి. తుర్కెమెనిస్థాన్ 180వ ర్యాంకుతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఉత్తర కొరియా ఒక్క స్థానం మెరుగుపడి 179 ర్యాంకుకు చేరుకుంది.

ABOUT THE AUTHOR

...view details