తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్, చైనాకు బయటి శక్తుల సాయం అనవసరం' - రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ

india
రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ

By

Published : Jun 23, 2020, 3:05 PM IST

Updated : Jun 23, 2020, 5:34 PM IST

16:56 June 23

'శాశ్వత సభ్యత్వంలో భారత్​కు మా మద్దతు'

భారత్​కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు ఉంటుందని ప్రకటించారు ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావరోవ్. శాశ్వత సభ్యత్వానికి భారత్ బలమైన పోటీదారు అని పేర్కొన్నారు. భారత్​ భద్రతా మండలి శాశ్వత సభ్య దేశంగా అవతరిస్తుందని తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు.

15:25 June 23

'భారత్, చైనాకు బయటి శక్తుల సాయం అనవసరం'

భారత్​, చైనా సరిహద్దు అంశమై త్రైపాక్షిక భేటీ వేదికగా స్పందించారు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్​రోవ్. అంతర్గత వ్యవహారాలు సహా ఇతర అంశాల్లో ఇరు దేశాలకు బయటి శక్తుల సాయం అనవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య సమస్యలను ద్వైపాక్షికంగా, శాంతియుతంగానే పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్షణ అధికారులు, విదేశాంగమంత్రుల స్థాయిలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయని గుర్తు చేశారు.

15:13 June 23

చైనాకు విదేశాంగమంత్రి చురకలు..

త్రైపాక్షిక భేటీ సందర్భంగా చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​. ప్రపంచ స్థాయి దేశాలు.. మిగతా దేశాలకు ఉదాహరణగా నిలవాలన్నారు. అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ భాగస్వాముల ఆసక్తులను కూటమి దేశాలు కాపాడాలని ఉద్ఘాటించారు. భాగస్వామ్య దేశాలకు మద్దతు, అందరి సంక్షేమం దిశగా కృషి చేయాలని.. ఇవే ప్రపంచంలో ఒక క్రమశిక్షణను తీసుకొస్తాయన్నారు. 

14:42 June 23

రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ

  • రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు సెర్గీ లావరోవ్, ఎస్​. జైశంకర్, వాంగ్​యీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
  • త్రైపాక్షిక కూటమికి రష్యా నేతృత్వం వహిస్తోంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఆర్థిక సామాజిక అంశాలతో పాటు కరోనా ప్రభావంపై కీలక చర్చ జరగనుందని సమాచారం.
  • రెండో ప్రపంచ యుద్ధ 75 ఏళ్ల వార్షికోత్సవం రోజు ఈ భేటీ జరగడం విశేషం అని పేర్కొన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్.
Last Updated : Jun 23, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details