సరిహద్దు సమస్యలను వేగవంతమైన పద్ధతిలో పరిష్కరించుకునే విధంగా భారత్- చైనా ఓ అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్ అంశంపై దౌత్యస్థాయి చర్చలు జరిపిన ఇరుదేశాలు.. ప్రస్తుతమున్న ఒప్పందాలు, నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
వాస్తవాధీన రేఖలో ప్రస్తుత పరిస్థితిపై దాపరికం లేకుండా, లోతైన అభిప్రాయాలు పంచుకున్నట్లు విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా తెలిపారు.
"దౌత్య సంబంధాల సమగ్ర అభివృద్ధికి సరిహద్దులో శాంతి పునరుద్ధరించడం చాలా అవసరమని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి.. బలగాలను ఉపసంహరించడానికి ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి."