తూర్పు లద్దాఖ్ పాంగాంగ్ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్- చైనా బ్రిగేడియర్ కమాండర్ స్థాయి అధికారులు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఈ ఘటనపై సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని భారత్ అధికారులు తెలిపారు. లద్దాఖ్‌లోని ముఖ్యమైన పర్వత ప్రాంతాలను, ప్రదేశాలపై భారత్ పట్టు సాధించిందని వెల్లడించారు. దీని వల్ల చైనా కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి వీలు కలిగిందన్నారు.
లద్దాఖ్ 310 కిలోమీటర్ల దూరంలో హోస్టన్ ప్రాంతంలో చైనా జె-20 యుద్ధ జెట్లు, ఇతర ముఖ్యమైన యుద్ధ పరికరాలను మోహరించిటనట్లు తెలుస్తోంది. వైమానిక చర్యలను వేగవంతం చేసిన తరుణంలో ఆ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని భారత వైమానిక దళం ఇప్పటికే సైన్యానికి సూచించింది.