భారత్ - అమెరికా మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాలు... రక్షణపరంగానే కాక ఇరుదేశాలు, అంతర్జాతీయ సమాజానికి ఎన్నో విధాల లబ్ది చేకూర్చుతాయని అంటున్నారు ప్రముఖ రక్షణ రంగ నిపుణులు... కమడోర్ చిత్రపు ఉదయ్‌భాస్కర్. ఇరుదేశాల మధ్య మంగళవారం కుదిరిన ఒప్పందాలు, వాటి ప్రభావంపై ఈటీవీ/ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో సమగ్ర విశ్లేషణ అందించారు. ఇరుదేశాల మధ్య చిరకాల మైత్రిబంధానికి కొనసాగింపుగానే ప్రస్తుత పరిణామాలను చూడొచ్చని.. కాకపోతే చైనా ట్రంప్ వైఖరి, గల్వాన్ ఘర్షణలు ఈ ఒప్పందాలపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు.
'బెకాతో అంతర్జాతీయ సమాజానికి మేలు' - ఉదయ్ భాస్కర్ రక్షణ రంగ నిపుణులు
అగ్రరాజ్యంతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలు సొంత ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సమాజానికి లబ్ధి చేకూర్చుతాయని ప్రముఖ రక్షణ రంగం నిపుణలు ఉదయ్‌భాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈటీవీ/ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఈ ఒప్పందాలపై వివరంగా మాట్లాడారు.
'భారత్-అమెరికా ఒప్పందం అంతర్జాతీయ సంఘానికే మేలు'
ఇదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో కలసి వస్తామన్న అమెరికా పర్యటనను స్వాగతిస్తూనే.. చైనాతో సామరస్యపూర్వక పరిష్కారానికి మొగ్గు చూపాలని సూచిస్తున్నారు కమడోర్ ఉదయ్‌భాస్కర్. అంతేకాక భారత్ - అమెరికా సంబంధాల విషయంలో పాకిస్థాన్ ప్రాధాన్యం కోల్పోతూ ఉండడం గమనించాల్సిన విషయం అని తెలిపారు.
ఇదీ చూడండి:-భాగస్వామ్యాలతో భారత్ దూకుడు- చక్రబంధంలో చైనా