దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 4,213 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 97 మంది ప్రాణాలు కోల్పోయారు.
"ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31.15 శాతం మంది రోగులు కరోనా నుంచి బయటపడ్డారు." - ఆరోగ్య మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి
రాష్ట్రాల వారీగా..
కరోనా మరణాల్లో ... మహారాష్ట్ర - 53, గుజరాత్ - 21, బంగాల్ - 14, తమిళనాడు - 3 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, కర్ణాటక, రాజస్థాన్‌ల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
ఒకటి మించి...
దేశంలో కరోనా మరణించిన వారిలో 70 శాతానికి పైగా ఒకటి మించి రోగ లక్షణాలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
భారత్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు