తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ పొట్టలో నుంచి బయటపడ్డ 1500 రాళ్లు - manipur women

మానవ శరీరంలో నుంచి రాళ్లు బయటపడ్డాయి. ఒకటో రెండో  కాదు.. ఏకంగా 1500 రాళ్లు కేవలం ఒక్క మనిషి కడుపులోనే ఉన్నాయి.

మహిళ పొట్టలో నుంచి బయటపడ్డ 1500 రాళ్లు

By

Published : Aug 29, 2019, 5:58 PM IST

Updated : Sep 28, 2019, 6:32 PM IST

మహిళ పొట్టలో నుంచి బయటపడ్డ 1500 రాళ్లు
పంజాబ్​లోని​ లూథియానా ప్రజావైద్యశాలలో ఓ మహిళ కడుపులోంచి 1500 వందల రాళ్లు బయటపడ్డాయి.

మణిపుర్​కు చెందిన ప్రేమలత గత మూడేళ్లుగా కాలేయంలో చేరిన రాళ్లతో తీవ్రంగా బాధ పడుతోంది. నొప్పి భరించలేక అనేక ఆసుపత్రులు తిరిగింది. శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించినా పేదరికం ఆమెను అడ్డుకుంది.

పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్నా.. ప్రైవేటు దవాఖానాల్లో శస్త్రచికిత్స చేయించుకునే స్తోమత లేక అశ్రద్ధ చేసింది. ఫలితంగా ఆమె పొట్టలో రాళ్ల సంఖ్య 15 వందలకు చేరింది. చివరకు లూథియానాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేస్తారని తెలిసి, ఇక్కడి వైద్యులను ఆశ్రయించింది.

సాధారణంగా మానవ శరీరంలో ఇంత తక్కువ పరిమాణంలో ఉన్న రాళ్లు కనిపించవు. కానీ, టెలీస్కోపిక్​, లాప్రాస్కోపిక్​ విధానాన్ని అనుసరిస్తే శస్త్ర చికిత్స విజయవంతమవుతుంది.

అందుకే.. ఈ అధునాతన సాంకేతికతను ఉపయోగించి డా. మిల్నే వర్మ... ప్రేమలతకు శస్త్ర చికిత్స చేశారు. మొత్తం 1500 రాళ్లు వెలికితీశారు. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది.


"12వ తేదీ నుంచి సమస్య తీవ్రమైంది. అందుకే ఈ ప్రజా వైద్యశాలలో ఆపరేషన్​ చేయించుకుని ఉపశమనం పొందాను. మూడేళ్లుగా ఈ సమస్యతో పోరాడుతూ వచ్చాను. నా కడుపులో 1500 రాళ్లున్నాయని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది."
-ప్రేమలత

ఇదీ చూడండి:మంచి మనసున్న మలయాళ మెగాస్టార్

Last Updated : Sep 28, 2019, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details