తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీజేఐకు అంతర్గత విచారణ కమిటీ క్లీన్​చిట్ - సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగొయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పసలేనివని కొట్టిపారేసింది అంతర్గత విచారణ కమిటీ. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం నిజంలేదని తేల్చిచెప్పింది.

సీజేఐకు అంతర్గత విచారణ కమిటీ క్లీన్​చిట్

By

Published : May 6, 2019, 6:06 PM IST

Updated : May 6, 2019, 10:16 PM IST

సీజేఐకు అంతర్గత విచారణ కమిటీ క్లీన్​చిట్

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయిపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో పస లేదని జస్టిస్‌ బాబ్​డే నేతృత్వంలోని అంతర్గత విచారణ కమిటీ తేల్చింది. ఈ మేరకు నివేదిక రూపొందించింది.

సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని, అవన్నీ నిరాధారమని కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు సీజేఐకు క్లీన్​ చిట్​ ఇచ్చింది.

అంతర్గత విచారణ కమిటీ నివేదికలో పొందుపర్చిన అంశాలను బహిర్గతం చేయబోమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ కార్యాలయం తెలిపింది. నివేదికను మే 5న జస్టిస్‌ బాబ్​డే తర్వాత సీనియర్‌ న్యాయమూర్తికి కమిటీ సమర్పించినట్లు వెల్లడించింది.

ఇదీ నేపథ్యం...

జస్టిస్​ రంజన్​ గొగొయిపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని ఏప్రిల్​ 20న వెలుగులోకి రావడం కలకలం రేపింది. అదే రోజు జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా భేటీ అయింది.

సీజేఐపై ఆరోపణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. జస్టిస్​ ఎస్​ఏ బాబ్​డే నేతృత్వంలో అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ కమిటీలో జస్టిస్‌ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ఇందిరా బెనర్జీ సభ్యులు.

ఆరోపణలు చేసిన మహిళ అంతర్గత విచారణ కమిటీ ముందు ఓసారి హాజరయ్యారు. తర్వాత... విచారణకు హాజరుకాబోనని ప్రకటించారు.

చివరకు... సీజేఐపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జస్టిస్ ఎస్​ఏ బాబ్​డే నేతృత్వంలోని కమిటీ తేల్చింది.

కుట్ర కోణం...

సీజేఐపై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందన్న కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

Last Updated : May 6, 2019, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details