తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: మహారాష్ట్రలో రెండు స్తంభాలాట

మహారాష్ట్ర.. యూపీ తర్వాత అత్యధిక లోక్​సభ స్థానాలున్న రాష్ట్రం. ఇక్కడ రెండు కూటములదే హవా. ఒకటి... భాజపా-శివసేన. రెండు... కాంగ్రెస్​-ఎన్సీపీ. వీటిని మినహాయిస్తే మిగతా చిన్న పార్టీల ప్రభావం అంతంతమాత్రమే.

మహారాష్ట్రలో భాజపా-శివసేన.. కాంగ్రెస్​-ఎన్సీపీలదే హవా

By

Published : Mar 31, 2019, 8:23 AM IST

మహారాష్ట్రలో భాజపా-శివసేన.. కాంగ్రెస్​-ఎన్సీపీలదే హవా
రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఒక్కోసారి చిన్నచిన్న పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతాయి. కేంద్రంలోనూ మెజార్టీ రాని పక్షంలో జాతీయ పార్టీలు.. చిన్న పార్టీల వైపే చూస్తాయి. కానీ.. మహారాష్ట్రలో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ వీటి పాత్ర నామమాత్రం మాత్రమే. భాజపా-శివసేన...., కాంగ్రెస్​- ఎన్సీపీ కూటములదే హవా.

ఇవీ చూడండి:

పార్లమెంటులో చోటుకు 'రాణి' వాసం తప్పనిసరి!

కాంగ్రెస్​కు "మరో చరిత్ర" సాధ్యమేనా..?

చిన్న పార్టీల విషయానికొస్తే రాజ్​ ఠాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ్​నిర్మాణ్​ సేన ఇప్పటికే లోక్​సభ బరిలో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించేందుకే ఈ నిర్ణయమని తెలిపారు ఠాకరే.

ఆమ్​ ఆద్మీ ఇక్కడ పోటీపై ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. రాష్ట్ర ఆప్​ అధ్యక్షుడు సుధీర్​ సావంత్​ మాత్రం పోటీ విషయమై.. దిల్లీలోని అధిష్ఠానం సంకేతాలకై వేచిచూస్తున్నారు.

బహుజన్​ సమాజ్ పార్టీ, సమాజ్​వాది పార్టీ ఉత్తర్​ప్రదేశ్​ తరహాలో ఇక్కడా కలిసి పోటీ చేస్తున్నాయి. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర ఎస్పీ వ్యవహారాల బాధ్యుడు అశోక్​ సింగ్​.

ప్రకాశ్​ అంబేడ్కర్​ భరిపా బహుజన్​ మహాసంఘ్​, అసదుద్దీన్​ నేతృత్వంలోని ఏఐఎంఐఎం రెండూ కలిసి వంఛిత్​ బహుజన్​ అఘాది(వీబీఏ)గా ఏర్పడ్డాయి. ఇది కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి ఓట్లను కొద్ది మేర చీల్చే అవకాశముంది. వీబీఏ మొత్తం 48 స్థానాల్లో పోటీకి దిగింది. సోలాపుర్​ నియోజకవర్గం నుంచి అంబేడ్కర్​ బరిలో ఉన్నారు.

''50 శాతం మంది ఓటర్లు మనతో ఉన్నారు. ఎన్డీఏ లేదా కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి మిగతా 50 శాతం కోసం కష్టపడాలి.''

- అంబేడ్కర్​, బీబీఎం అధినేత

స్వాభిమాని షెఠ్​కారి సంఘటన్​ పార్టీ.. కాంగ్రెస్​- ఎన్సీపీ కూటమితో కలిసి రెండు లోక్​సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.

ఒకప్పుడు దేశరాజకీయాల్లో ప్రభావం చూపిన సీపీఐ.. ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్​- ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడంలో విఫలమైంది.

''భాజపా- శివసేనకు సవాల్​ విసరగలిగేది కాంగ్రెస్​- ఎన్సీపీ కూటమి మాత్రమే. కాంగ్రెస్​తో పొత్తులో విఫలమైనా .. ఈ కూటమి గెలవాలని కోరుకుంటున్నాం. అయినప్పటికీ... మేం ఇక్కడ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం.''

- ప్రకాశ్​ రెడ్డి, సీపీఐ నేత

ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ... నేషనల్​ ఉమెన్స్​ పార్టీ(ఎన్​డబ్ల్యూపీ) అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలోనూ ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. కనీసం 10 స్థానాల్లోనైనా పోటీ చేయాలని భావిస్తోంది.

''ప్రధాన పోటీ భాజపా- శివసేన... కాంగ్రెస్​- ఎన్సీపీ కూటముల మధ్యే. చిన్న పార్టీల ప్రభావం అంతంతమాత్రమే ఉండనుంది. కూటమిలో ఉండే ఇతర పార్టీలకు పడే ఓట్లను కొంచెం పెంచగలవు. ''

-ప్రకాశ్​ బల్​ జోషి, రాజకీయ పరిశీలకుడు

ఇలా ఒకటో రెండో మినహా మిగతా చిన్న పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీపై అంత ఆసక్తిగా లేవు. కనీస స్థానాల్లో పోటీ చేయడానికీ అభ్యర్థులు కరవయ్యారు. వంఛిత్​ బహుజన్​ అఘాది(వీబీఏ), ఎస్పీ-బీఎస్పీ కూటమి మాత్రం కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి. కానీ.. ఇందులో స్థానిక పార్టీ వీబీఏ లోని ప్రకాశ్​ అంబేడ్కర్​ భరిపా బహుజన్​ మహాసంఘ్ ఒకటే. ఎస్సీలు తమ వెన్నంటే ఉన్నారని భావిస్తున్న ఈ కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇవీ చూడండి:

భారత్​ భేరి: అందరి చూపు ఆ స్థానాలపైనే

"నోట్ల రద్దుకు 'న్యాయ'మైన​ సమాధానం"

ABOUT THE AUTHOR

...view details