తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్యులపై దాడులను నిరసిస్తూ ప్రధానికి ఐఎంఏ లేఖ - వైద్యులు

దేశంలో వైద్యులపై దాడులను అరికట్టేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్ (ఐఎంఏ). అత్యవసరంగా ఆర్డినెన్స్​ జారీ చేయాలని కోరింది.

వైద్యులపై దాడులను నిరసిస్తూ ప్రధానికి లేఖ

By

Published : Sep 4, 2019, 3:50 PM IST

Updated : Sep 29, 2019, 10:20 AM IST

విధుల్లో ఉన్న వైద్యులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ). దాడులను అరికట్టేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ప్రస్తుతం అత్యవసరంగా ఆర్డినెన్స్​ జారీ చేయాలని కోరింది.

ఇటీవల అసోంలో జరిగిన ఘటనలో ఓ వైద్యుడు మృతి చెందాడు. దానిపై అక్కడి వైద్యులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానికి లేఖ రాసింది ఐఎంఏ. ఇలాంటి భయానక వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించటం సాధ్యం కాదని లేఖలో పేర్కొంది. 'మనసులో మాట' కార్యక్రమంలో భాగంగా వైద్యులపై దాడులను ప్రధాని మోదీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేసింది.

మద్దతుగా డబ్ల్యూఎంఏ..

భారతీయ వైద్యులకు మద్దతుగా నిలిచింది అంతర్జాతీయ మెడికల్​ అసోసియేషన్​ (డబ్ల్యూఎంఏ). ఇటీవలి కాలంలో భారత్​లో వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​కు లేఖ రాసింది.

ముసాయిదా బిల్లు-2019

వైద్యులు, ఆస్పత్రులపై దాడులు చేయటం నేరంగా పరిగణించే బిల్లు-2019 ముసాయిదాను రూపొందించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ బిల్లు చట్టంగా మారితే విధుల్లో ఉన్న వైద్యులపై దాడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రసుత్తం ముసాయిదా చట్టాన్ని ప్రజాభిప్రాయం కోసం పబ్లిక్​ డొమైన్​లో ఉంచారు.

ఇదీ చూడండి: '72 గంటల వంట'తో ప్రపంచ రికార్డుకు శ్రీకారం

Last Updated : Sep 29, 2019, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details