తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఎంసీ ఎఫెక్ట్​: 8న దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె - ఎన్​ఎంసీ

ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది భారత వైద్య మండలి. వైద్యులందరూ విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొనాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్​ చట్టాన్ని తొలగించేవరకు పోరాటం కొనసాగించాలని సూచించింది.

ఐఎంఏ

By

Published : Aug 6, 2019, 6:01 AM IST

జాతీయ వైద్య కమిషన్​ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్​ బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది భారత వైద్య మండలి (ఐఎంఏ). ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని కోరింది.

భారతీయ వైద్య మండలి(ఎంఐఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంటులో ఆమోదం లభించింది. బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్లు, వైద్య విద్యార్థులు నిరసనలు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. వైద్య విద్యలో ఇదో గొప్ప సంస్కరణగా నిలిచిపోతుందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details