తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్​ఎంసీ' ఎఫెక్ట్​ : బుధవారం వైద్య సేవలు బంద్​ - దిల్లీ

భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) బుధవారం దేశవ్యాప్తంగా వైద్యసేవల బంద్​కు పిలుపునిచ్చింది. ఐఎంఏ స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) బిల్లును లోక్​సభలో ఆమోదించినందుకు నిరసనగా ఈ బంద్​ పాటించనున్నారు. అత్యవసర సేవలు కొనసాగనున్నాయి.

'ఎన్​ఎంసీ' ఎఫెక్ట్​

By

Published : Jul 30, 2019, 4:07 PM IST

భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బుధవారం వైద్యసేవల బంద్​కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా మిగతా వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ బంద్​లో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 6 గంటలనుంచి స్వచ్ఛందంగా బంద్​ పాటించనున్నారు. ఎన్​ఎంసీ బిల్లు సోమవారమే లోక్​సభలో ఆమోదం పొందింది.

ఈ బిల్లును నిరసిస్తూ సోమవారం 5వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు దిల్లీ వేదికగా నిరసన తెలిపారు. వైద్యవిద్యలో సంస్కరణల కోసం ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీ ఎయిమ్స్​ ఆసుపత్రి నుంచి ర్యాలీగా వెళ్లి నిర్మాణ్​ భవన్​ను ముట్టడించారు.

ఐఎంఏ విధానాలు పేదలకు, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విధానంలో సంస్కరణలు సరిగా జరగలేదని వాదిస్తోంది.

ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details