ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం భారత్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులు చురుకుగా సేవలందించాలని ఆ సంస్థ కోరింది. పంపిణీ క్రతువులో సభ్యులంతా భాగస్వామ్యులు కావాలని ఒక ప్రకటనలో తెలిపింది.
వారి శ్రమ అపారం..
కొవిడ్-19 టీకాను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహా.. అనేకమంది శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారని ఐఎంఏ గుర్తుచేసింది. పరిశోధకులు, శాస్త్రవేత్తల శ్రమను అభినందించాల్సిందేనని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజల కలల్ని సాకారం చేస్తూ.. టీకాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు శాస్త్రవేత్తలు దోహదం చేశారని కొనియాడింది.