తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం

ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిల్​పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్రం, సీబీఐతో పాటు 5 రాష్ట్రాల ప్రభుత్వాలను నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై స్పందించాలని ఆయా ప్రభుత్వాలను ఆదేశించింది.

By

Published : Jul 24, 2019, 12:15 PM IST

Updated : Jul 24, 2019, 2:49 PM IST

అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం

ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్రం, సీబీఐ, 5 రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయంటూ.. అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్​)​ దాఖలైంది.

అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే.. ఈ రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారంటూ కోర్టుకు తెలిపారు పిటిషనర్​ తరఫు న్యాయవాదులు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు, పంజాబ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలతో పాటు పర్యావరణ, గనుల మంత్రిత్వ శాఖలను స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలు ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోకుండా పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని కేంద్రానికి స్పష్టం చేసింది.

Last Updated : Jul 24, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details