తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా  ఐఐటీ మద్రాస్​ - MHRD

దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​ ఎంపికయింది. 2019 సంవత్సరానికి గానూ ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగులను విడుదల చేసింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. ఐఐఎస్సీ బెంగళూరు, మిరండా హౌస్-దిల్లీ విద్యాలయాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఐఐటీ మద్రాస్

By

Published : Apr 8, 2019, 11:19 PM IST

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ-మద్రాస్​ మరో ఘనత సాధించింది. 2019 సంవత్సరానికి గానూ ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్​లలో మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకింగ్​లను విడుదల చేసింది. తర్వాతి స్థానాల్లో ఐఐఎస్సీ బెంగళూరు, మిరండా హౌస్-దిల్లీ నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్​సీయూ) పదకొండో స్థానంలో ఉంది.

కొన్నేళ్లుగా మొదటి స్థానంలో నిలిచిన ఐఐఎస్సీ బెంగళూరు ఈ సారి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి పది స్థానాల్లో 8 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.

1. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్

2. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సైన్సెస్, బెంగళూరు

3. మిరండా హౌస్, దిల్లీ

4. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే

5. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్​పూర్

6. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్

7. జవహార్ లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం, దిల్లీ

8. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ

9. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువహటి

10. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి

ఇవీ చూడండి:

మౌలిక వసతులు, ప్రయోగ శాలలు, విద్యా నాణ్యతలను పరిశీలించి ర్యాంకులను విడుదల చేసింది మంత్రిత్వ శాఖ. మొత్తంగా 4,867 సంస్థలు ర్యాంకింగ్​కు దరఖాస్తు చేసుకోగా 3,127 ఎంపికయ్యాయి. అందులో వివిధ అంశాల వారీగా ర్యాంకులను ప్రకటించారు. వివిధ విభాగాల వారీగా మొదటి స్థానంలో నిలిచిన విద్యాసంస్థలు.

  • విశ్వవిద్యాలయాల విభాగం- ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు
  • ఇంజినీరింగ్ విభాగం- ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్
  • కళాశాలల విభాగం- మిరండా హౌస్, దిల్లీ
  • మేనేజ్​మెంట్ కళాశాల- ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మేనేజ్​మెంట్​, బెంగళూరు
  • వైద్య కళాశాల- ఏయిమ్స్, దిల్లీ
  • న్యాయ కళాశాల- నేషనల్ లా స్కూల్​ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ, బెంగళూరు
  • నిర్మాణ రంగం- ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్​పూర్
  • ఫార్మసీ విభాగం- జామియా హమ్​దర్ద్, దిల్లీ

ABOUT THE AUTHOR

...view details