తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య రామాలయంలో ఇఫ్తార్​ విందు - ఇఫ్తార్​

అయోధ్యలో మతసామరస్యం వెల్లివిరిసింది. ఓ సీతారామ దేవాలయంలో అర్చకుడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.​ మతపరమైన భేదాలు లేకుండా ప్రజలందరూ కలిసి  అన్ని పండుగలు జరుపుకోవాలని సూచించారు.

అయోధ్య సీతారామాలయంలో ఇఫ్తార్​ విందు

By

Published : May 21, 2019, 10:09 AM IST

సీతారాముల సమక్షంలో ఇఫ్తార్​ విందు

రంజాన్​ మాసంలో మత సామరస్యానికి వేదికైంది ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్య. నగరంలోని ఓ సీతారామాలయంలో అర్చుకుడు ఇఫ్తార్​ విందు ఇచ్చారు.

ఆలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందుకు అన్ని మతాల వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇది మూడోసారి అని తెలిపారు అర్చకుడు యోగల్​ కిషోర్​. మతభేదాలు లేకుండా ప్రజలందరూ అన్ని పండుగలను జరుపుకోవాలన్నారు.

ఇఫ్తార్​ విందుకు హాజరైన ముస్లింలు యోగల్​పై ప్రశంసల వర్షం కురిపించారు. మతాల పేరుతో రాజకీయాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేసి ప్రపంచానికి మంచి సందేశాన్నిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ధోనిని తలపించిన ఇంగ్లాండ్​ క్రికెటర్లు

ABOUT THE AUTHOR

...view details