తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీని గెలిపిస్తే మీ పిల్లలు చౌకీదార్​లే అవుతారు జాగ్రత్త' - చౌకీదార్​

భాజపా చేపట్టిన 'మై బీ చౌకీదార్'​ ప్రచారంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ విమర్శలు చేశారు. తమ పిల్లలను కాపలాదారులుగా చూడాలనుకునే వారు మోదీకి ఓటేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యావంతులు కావాలనుకుంటే ఆమ్​ఆద్మీకి మద్దతివ్వాలను పిలుపునిచ్చారు.

కేజ్రీవాల్​

By

Published : Mar 21, 2019, 6:01 AM IST

భాజపా చేపట్టిన 'మై బీ చౌకీదార్'​​ ప్రచారంపై ఆమ్​ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ విమర్శలు గుప్పించారు. ఎవరైతే తమ పిల్లలను కాపలాదారులుగా చూడాలనుకుంటున్నారో... వారు మోదీకి ఓటేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిల్లలను మంచి విద్యావంతులను చేయాలనుకునే వారు ఆప్​కి మద్దతివ్వాలని కోరారు.

దేశప్రజలందరిని కాపలాదారులుగా చేయాలని మోదీ కోరుకుంటున్నారని ట్విటర్​ వేదికగా ఆరోపించారు కేజ్రీవాల్​.

" తమ పిల్లలను చౌకీదార్లు చేయాలనుకునేవారు మోదీకి ఓటేయాలి. కానీ మంచి విద్య అందించి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు చేయాలనుకుంటే ఆప్​కి ఓటేయాలి."- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

శనివారం మోదీ తన మద్దతుదారులను 'మై బీ చౌకీదార్' (నేనూ కాపలాదారుడినే) ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

ఇదీ చూడండీ:ప్రజా ఉద్యమంగా చౌకీదార్

ABOUT THE AUTHOR

...view details