తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జీవితాంతం టోల్​ కట్టాల్సిందే.. రద్దు కుదరదు' - రోడ్డు రవాణ

రహదారులే అభివృద్ధికి బాటలు వేస్తాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ ఉద్ఘాటించారు. రహదారులు, హైవేల మంత్రిత్వశాఖకు నిధుల కేటాయింపుపై  లోక్​సభలో చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రహదారుల నిర్మాణానికి టోల్​ పన్ను తప్పనిసరని స్పష్టం చేశారు.

నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

By

Published : Jul 16, 2019, 7:14 PM IST

సౌకర్యవంతమైన రహదారులు కావాలంటే తప్పనిసరిగా టోల్‌ పన్నులు చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. కేంద్రం వద్ద తగిన నిధులు లేనంతకాలం టోల్​ వ్యవస్థను కొనసాగిస్తామని, అయితే రేట్లలో మార్పులు ఉండొచ్చని తెలిపారు. రోడ్డు రవాణా, రహదారుల నిర్మాణాలకు నిధుల కేటాయింపుపై లోక్​సభలో చర్చ సందర్భంగా గడ్కరీ టోల్​ పన్ను రద్దు కుదరదని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల కాలంలో ఎన్​డీఏ సర్కారు 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. ఈ మార్గాల్లో వసూలు చేసిన టోల్‌ పన్ను మొత్తాన్ని గ్రామీణ కొండ ప్రాంతాల్లో రహదారులు, భవనాల నిర్మాణానికి వినియోగిస్తున్నామని తెలిపారు. టోల్​ పన్నుకు ముగింపు ఉండదని స్పష్టం చేశారు.

నితిన్​ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

"12 గంటలు పట్టే ప్రయాణానికి 2 గంటలు పడుతుంటే మీకు ఇంధనం, సమయం మిగులుతుంది కదా. అప్పుడు ఆ డబ్బును టోల్​ రూపంలో చెల్లించండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనంతకాలం మంచి సేవలు, రహదారులు కావాలంటే టోల్​ చెల్లించాల్సిందే."

-నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా మంత్రి

గడ్కరీ ప్రసంగంలో ఇతర అంశాలు

  • దిల్లీ- ముంబయి గ్రీన్​ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం.
  • భూసేకరణ సమస్యతో రహదారుల నిర్మాణానికి ఆటంకం కలుగుతోంది.
  • 80 శాతం భూసేకరణ జరగని ప్రాజెక్టులను నిలిపివేశాం.
  • ఇదే కారణంతో బంగాల్​, బిహార్​లో ప్రాజెక్టులు నెమ్మదిగా సాగుతున్నాయి.
  • పాఠశాల బస్సులు, రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులకు టోల్​ మినహాయింపు కల్పించే అంశాన్ని పరిశీలిస్తాం.

ఇదీ చూడండి: సభలో హాజరుపై మంత్రులకు మోదీ క్లాస్

ABOUT THE AUTHOR

...view details