తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పాక్​తో చర్చలంటూ జరిగితే 'పీఓకే'పై మాత్రమే' - Defence Minister

ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పాకిస్థాన్​తో చర్చల ప్రసక్తే లేదని మరోమారు ఉద్ఘాటించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పాక్​తో ద్వైపాక్షిక చర్చలంటూ జరిగితే అవి పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)​ అంశంపైనే ఉంటాయని స్పష్టం చేశారు.

'పాక్​తో చర్చలంటూ జరిగితే 'పీఓకే'పై మాత్రమే'

By

Published : Aug 18, 2019, 4:11 PM IST

Updated : Sep 27, 2019, 10:05 AM IST

పాకిస్థాన్​తో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సివస్తే అది పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీఓకే) అంశంపైనేనని స్పష్టం చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు ఆపి.. దానిని నిర్మూలించే వరకు పాక్​తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా జన్​ ఆశీర్వాద్​ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు రాజ్​నాథ్​.

"పాకిస్థాన్​తో చర్చలు చేపట్టాల్సి వస్తే అది పాక్​ ఆక్రమిత కశ్మీర్​ అంశంపైనే. మరే సమస్యపైనా చర్చించే ప్రసక్తే లేదు. అధికరణ 370 రద్దు దాయాది దేశాన్ని బలహీనపరిచింది. వారికి అది ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు పాక్​ ప్రతిఒక్క తలుపు కొడుతోంది. వారికి సహాయం అందించాలని వివిధ దేశాలను కలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా సైతం పాకిస్థాన్​కు చివాట్లు పెట్టింది. భారత్​తో చర్చలు జరపాల్సిందిగా ఆ దేశానికి హితవు పలికింది. "

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

ఉగ్రవాదం ద్వారా భారత్​ను అస్థిరపరిచేందుకు, బలహీనపరిచేందుకు పాక్​ యత్నిస్తోందని ఆరోపించారు రాజ్​నాథ్​. దానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గట్టి సమాధానమిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'పరిస్థితులను బట్టే అణ్వస్త్రాల వినియోగంపై నిర్ణయాలు'

Last Updated : Sep 27, 2019, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details