తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"ఆర్టికల్​ 370 రద్దు చేస్తే.. తీవ్ర పరిణామాలు" - మెహబూబా ముఫ్తీ

కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ వ్యాఖ్యలపై మండిపడ్డారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. ఆర్టికల్​ 370, ఆర్టికల్​ 35- ఏ లను రద్దు చేస్తే... దేశానికి, రాష్ట్రానికి మధ్య ఉన్న సంబంధాలు ముగిసిపోతాయని హెచ్చరించారు.

"ఆర్టికల్​ 370 రద్దు చేస్తే.. అంతే"

By

Published : Mar 31, 2019, 4:02 AM IST

"ఆర్టికల్​ 370 రద్దు చేస్తే.. అంతే"

ఆర్టికల్​ 370ను రద్దు చేయాలన్న కేంద్రమంత్రి అరుణ్​జైట్లీ వ్యాఖ్యలపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. అలా జరిగితే దేశానికి, జమ్ముకశ్మీర్​ రాష్ట్రానికి మధ్య ఉన్న సంబంధం అంతటితోనే ముగిసిపోతుందని ఆమె హెచ్చరించారు.

"జమ్ముకశ్మీర్ పార్టీలకు తెలియాల్సి ఉంది. మనం ఎన్నికలకు ఏ రాజ్యాంగం ప్రకారం వెళ్తామో. ఆర్టికల్ 370 వల్లే భారత రాజ్యాంగం జమ్ముకశ్మీర్​లో అమలవుతోంది. జమ్ముకశ్మీర్, భారత్​ సంబంధాలు ఏ నిబంధనల ప్రకారం ప్రారంభమవుతాయి. నూతన నిబంధనలతో ప్రారంభిస్తే మళ్లీ వివాదాలు ప్రారంభమవుతాయి.. 370 ఆర్టికల్​ను రద్దు చేస్తే భారత్​తో కశ్మీర్ సంబంధాలు సైతం రద్దవుతాయి." - మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి


ఆర్టికల్​ 370 కేంద్రానికి, జమ్ముకశ్మీర్​కు మధ్య వంతెన లాంటిదని ముఫ్తీ అన్నారు. అదే లేకపోతే తిరిగి సంప్రదింపులు ప్రారంభించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భారత్​తో జమ్ముకశ్మీర్​ కొనసాగాలా వద్దా అని పునరాలోచన చేయాల్సి వస్తుందని అన్నారు.

"జైట్లీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది చెప్పినంత సులువు కాదు. మీరు (కేంద్ర ప్రభుత్వం) ఆర్టికల్​-370ను రద్దు చేస్తే, అంతటితో దేశానికి, రాష్ట్రానికి ఉన్న సంబంధాలు ముగిసినట్లే."
- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి

జమ్ముకశ్మీర్​ ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న ఆర్టికల్​ 370, ఆర్టికల్​ 35-ఏలను రద్దు చేయాలని అరుణ్​జైట్లీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ అధికరణల వల్ల జమ్ముకశ్మీర్​లో స్థిర ఆస్తులను ఇతర ప్రాంత ప్రజలు కొనడానికి, స్థిర నివాసం ఏర్పరుచుకోవడానికి వీలుపడదు.

ABOUT THE AUTHOR

...view details