దేశంలో వివిధ దశల లాక్‌డౌన్ సందర్భంగా కరోనా కేసులు పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వెర్రితనం.. ఒకే పనిని పదేపదే చేయిస్తుందని, ఫలితాలను మాత్రం భిన్నంగా ఆశిస్తారు అనే సూత్రాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఈ మేరకు ఈ సూత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
నాలుగు దశల లాక్‌డౌన్ సందర్భంగా నమోదైన కరోనా కేసుల వివరాలను కూడా తన ట్వీట్‌కు జత చేశారు. కేంద్ర ప్రభుత్వ అహంకారం, చేతగానితనం వల్ల మహా విషాదం చోటు చేసుకుంటోందని రాహుల్ శుక్రవారం కూడా విమర్శలు చేశారు.