తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చైనాకే కాదు.. దూకుడుగా ఉండటం మాకూ వచ్చు' - వాస్తవాధీన రేఖ

తుర్పులద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తే దానికి దీటుగా బదులిస్తామని భారత ఎయిర్​ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా హెచ్చరించారు. రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో డెసర్ట్​ నైట్​-21 పేరుతో భారత, ఫ్రెంచ్​ వైమానికి దళాల సంయుక్త విన్యాసాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు.

If China can be aggressive at LAC
'చైనా హద్దుమీరితే తగిన బుద్ధి చెబుతాం'

By

Published : Jan 23, 2021, 10:28 PM IST

రానున్న నెలల్లో తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు ప్రదర్శించే అవకాశముందన్న వార్తలపై భారత వాయుసేన సారథి ఆర్​కేఎస్ భదౌరియా స్పందించారు. దూకుడుగా ఉండటం తమకు కూడా వచ్చన్నారు. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇందుకోసం సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో డెసర్ట్​ నైట్​-21 పేరుతో భారత- ఫ్రెంచ్​ వైమానిక దళాలు సంయుక్తంగా చేస్తోన్న విన్యాసాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు భదౌరియా.

అయితే రాజస్థాన్​లో చేస్తోన్న వైమానిక విన్యాసాలను తూర్పులద్దాఖ్​లో కూడా చేస్తారా?అని ప్రశ్నించగా , అలాంటి దేమీ లేదన్నారు. భారత్​, ఫ్రాన్స్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికే ఇలాంటి విన్యాసాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా చేసే ఈ విన్యాసాలు మరో దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నవి కావని అన్నారు.

ఫ్రాన్స్​నుంచి 8 రఫేల్​ యుద్ధవిమానాలు అందాయని మరో మూడు ఈ నెలాఖరు వరకల్లా వస్తాయని తెలిపారు. కాగా పైలట్ల శిక్షణ పూర్తయినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఎల్​ఏసీ నుంచి ఎల్​ఓసీ వరకు.. నేతాజీ మార్గంలోనే​'

ABOUT THE AUTHOR

...view details