కర్ణాటక మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఈడీ బాంబు ఘటన సోమవారం కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు ఆదిత్యరావ్.. ఇవాళ ఉదయం బెంగళూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతడిని విచారించేందుకు మంగళూరు పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం బెంగళూరు పయనమైంది.
విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడి లొంగుబాటు
కర్ణాటక మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పద బ్యాగులో బాంబు ఘటన నిందితుడు ఆదిత్య రావ్.. ఇవాళ బెంగళూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతడ్ని విచారించేందుక మంగళూరుకు చెందిన ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరు పయనమైంది.
విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడు లొంగుబాటు
ఇదీ జరిగింది
కర్ణాటక మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల విశ్రాంతి గదిలో ఓ అనుమానాస్పద బ్యాగు సోమవారం కలకలం రేపింది. అందులో బాంబు ఉందన్న అనుమానంతో కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. బ్యాగులో ప్రమాదకర ఐఈడీ పరికరాన్ని గుర్తించారు అధికారులు. వెంటనే అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేయించి.. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాగును వేరే ప్రాంతానికి తరలించారు. ఐఈడీని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.
Last Updated : Feb 17, 2020, 11:11 PM IST